TEJA NEWS

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా తోలి సెట్ నామినేషన్ ను డాక్టర్ కడియం కావ్య దాఖలు చేశారు. ఉదయం మొదటగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి , నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కేఆర్ నాగరాజు, దొమ్మటి సాంబయ్య తో కలిసి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యలయంలో వరంగల్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య కి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

ఈ సందర్బంగా డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ వరంగల్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలి సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రావీణ్య కి సమర్పించినట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా గెలిపిస్తే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరే విధంగా విద్యా, ఉద్యోగ, ఉపాధ


TEJA NEWS