కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో డిఎస్పి ఇన్స్పెక్షన్
కారంపూడి కాకతీయ రిపోర్టర్ కల్లూరి. గోపి
కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో గురజాల డీఎస్పీ జగదీష్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. అనంతరం డీస్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సాధారణ తనిఖీల్లో భాగంగా రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎస్పి జగదీష్ మాట్లాడుతూ ప్రజలతో పోలీసు సిబ్బంది కలిసిమెలిసి ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండలన్నారు. ఈ కార్యక్రమం లో కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ టీ.వీ . శ్రీనివాసరావు , కారంపూడి ఎస్సై టీ. వాసు, రెంటచింత ఎస్సై టీహెచ్. నాగార్జున కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిబ్బంది, కారంపూడి పోలీస్ సిబ్బంది తదితరులు పాలుగోన్నారు.