అక్రమచేపలు పెంపకం దార్లుకు దసరా తగిలింది
………………………………………………………………………
సాక్షిత:- దేవరాపల్లి అక్రమచేపలు పెంపకం దార్లుకు దసరా తగిలింది సందిట్లో సడిమియాలాగ అక్రమ చేపలు పెంపకం దార్లు పూర్తిగా బరితెగించేసారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు దేవరాపల్లి మండలం లోని కోత్త పెంట ములకాలపల్లి పెదనందిపల్లి కలిగోట్ల తారువా మారేపల్లి గజపతి నగరం చేనులపాలెం తదితర గ్రామాల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి డి వెంకన్న విస్రుతంగా పర్యాటించి అక్రమ చేపలు చేరువులను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు,దసరా రావడంతో గతరెండు రోజులు నుండి చికెన్ వ్యర్దాలు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా దోరకడంతో చేపలను పెంపకం దార్లు పూర్తిగా బరితెగింపుకు పూనుకోని ప్రతి చేరువులోని వ్యర్దాలను తీసుకోచ్చి పడెసారని తెలిపారు, మండలం లోని ఏటువంటి అనుమతులు లేకుండా దాదాపుగా పదిహేను వందల ఎకారాల్లో అక్రమ చేపలు చేరువులు వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుందని తెలిపారు
ఈచేరువుల అన్ని ఇతర జిల్లాలకు చేందిన వ్యపారస్తులు దేవరాపల్లి మండలోని రైవాడ నీళ్ళు అనువుగా ఉండడంతో రైతులకు డబ్బులు అశచూపించి భూములు లీజులకు తీసుకోని చేరువులు తవ్వకాలు చేపాట్టారని తెలిపారు,ఈచేపలు పెంపకం కోరకు, మేతగా చనిపోయిన పసుమాంసం చీకెన్ గోర్రేలు మేకలు వ్యర్థాలను మరియు బ్రాండేక్సు పెద్ద పెద్ద హాటల్స్ నుండి వ్యర్థాలను తీసుకు వచ్చి చేపలకు మేతగా వేస్తున్నారని తెలిపారు దీని వలన చేపలు తినే వారికి తీవ్రమైన రోగాలు కెన్సర్ వంటి భయంకర మైన వ్యాదులు వస్తాయని తెలిపారు దీంతోపాటు చేరువులు ప్రక్కనే ఉన్న పసువులు పాకలు కళ్ళాలు తో పాటు చేరుల్లో వ్రుదా నీటిని పోలాల్లోకి వదిలి పెడుతున్నారని దీని వలన రైతులు వరినాట్లు గాబులు తీసినప్పడు తీవ్ర ఇబ్బందులు పడుతూ కాళ్ళుకు శర్మ వ్యాదులు వస్తున్నాయని తెలిపారు,రైవాడ రిజర్వేయరు నుండి రైతులకు అంద వలసిన నీళ్ళును చేపలు చేరువులకు వాడుకుంటు రైతులు పోలాలకు నీళ్ళు లేకుండా చేస్తున్నారని తెలిపారు ఇంతటి దౌర్బగ్యపు పరిస్థితికి పాల్పడు తున్నప్పటికి స్తానిక రాజకీయ నాయకులకు భయపడి అదికారులు.నోరు మేదపడం లేదన్నారు గతంలో రెవెన్యూ పోలీసు పీసరింగ్ విజిలెన్స్ అదికారులు పట్టుకొని కేసులు పెట్టె వారని ప్రస్తుతం వారు కూడా పట్టించు కోవడం లేదన్నారు,
దీనిపై గతంలో జిల్లా కలెక్టర్ వారికి పిర్యాదు చేయడంతో పీసరింగ్ అదికారులు చేపలు పెంపకం దార్లుకు నోటిసులు ఇచ్చి మామ్మూళ్ళో తీసుకోనీ నోటిషులు ఇచ్చి చేతులు దులుపుకోని వదిలేసారని తెలిపారు మాముళ్ళు కక్కుర్తి పడి పూర్తిగా బాధ్యత మరిచి పోవడంతో అక్రమ చేపలు పెంపకం దార్లు మరింతగా రెచ్చిపోయి,బరి తెగింపుకు,పూను కుంటున్నారని అగ్రహం వ్యక్తం చేసారు ఇతర జిల్లాల్లో ఇటువంటి పెంపకాలను వ్యతి రేఖించడంతో మన జిల్లాలోని దేవరాపల్లి మండలంలోని ఇక్కడ రైతులకు డబ్బులు అశ చూపించి భూములు లీజులకు తీసుకోని,అక్రమంగా చేపలు పెంపకాలు, చేపాట్టారని తెలిపారు లాభాలు కోసం ప్రజలు ప్రాణాలతో చేలగాటం అడుతూ,ఇటువంటి ఘాతుకానికి పూను కుంటున్నారని అవేదన వ్యక్తం చేశారు జిల్లాలోని మరే క్కడా ఇటు వంటి దౌర్బగ్యపు పరిస్థితులు లెవన్నారు అక్రమ సంపాదనలకు అశపడి ఇటువంటి పనులకు పూనుకుంటు ప్రజలు ప్రాణాలతో చేలగాటం ఆడుతున్నారని తెలిపారు ఇది కేవలం అదికారులు వైఫల్య మేనని తెలిపారు వెంటనే చేపలు చేరువులపై ఉన్న గ్రైయిండింగ్ మిషన్లు తోలగించాలని అనుమతులు లెని చేపలు చేరువులు పెంపకం దార్లుపై క్రిమినల్ కేసులు పెడితే తప్ప మార్పులు రావని తెలిపారు దీనికి ఇప్పుడు ఉన్న అదికారులు అందరూ కాసులకు కక్కుర్తి పడి పట్టించు కోవడం లెదని తెలిపారు అక్రమ చేపలు పెంపకం దార్లుపై కఠిన చర్యలు కోసం విజెలెన్స్ అదికారులకు బాద్యత అప్పగించి కఠిన చర్యలు తీసుకోవాలని వెంకన్న డిమాండ్ చేసారు,