TEJA NEWS

ED searches Patan Cheru MLA's residence

పటాన్ చెరు ఎమ్మెల్యే నివాసంలో ఈడీ సోదాలు

హైదరాబాద్:
హైదరాబాద్‌లోగురువారం ఈడీ సోదాలు నిర్వహిస్తోం ది. పటాన్‌చెరు ఎమ్మెల్యే MLA గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలోఈరోజు ఈడీ తనిఖీలు చేపట్టింది.

మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు,బంధుల ఇళ్లలో నూ, సోదాలు కొనసాగుతు న్నాయి.. మొత్తంగా ఏక కాలంలో మూడు చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

అలాగే, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్‌ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

అయితే, ఇద్దరు సోదరులు మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో ఓ కేసులో గూడెం మధు అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే.

ఇక, తాజా సోదాల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది….


TEJA NEWS