విద్యావంతులు, విశ్రాంత ఉద్యోగులు సామాజిక సేవ చేయాలి….. కళావేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్
వనపర్తి :
విశ్రాంత ఉద్యోగులు విద్యావంతులు తమవంతు సామాజిక సేవలో పాల్గొనాలని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు.మూడున్నర దశాబ్దాలు ఉపాధ్యాయుడిగా ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి శుక్రవారం ఉద్యోగ విరమణ చేసిన కె.శంకరయ్యను ఆయన నివాసంలో కళావేదిక పక్షాన శాలువ జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగ విధులు నిర్వహించి రిటైర్డ్ అవుతున్న విద్యావేత్తలు తమ విశ్రాంత సమయంలో సామాజిక సేవలో పాల్గొంటూ పలువురికి మార్గదర్శకం కావాలని అన్నారు.ప్రధానోపాధ్యాయుడిగా శంకరయ్య విద్యార్థుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారని జిల్లా విద్యాశాఖలో కూడా ఆయన తన సేవలు అందించారని శంకర్ గౌడ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత భైరోజు చంద్ర శేఖర్, ఆర్డి ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు చిన్నమ్మ థామస్,పీఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు బౌద్ధారెడ్డి, శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
