TEJA NEWS

అశ్వారావుపేట పోలీసుల ఆధ్వర్యంలో
రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా అశ్వారావుపేట పోలీసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. రింగ్ సెంటర్ నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు సాగిన ఈ పరుగును సిఐ నాగరాజు రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఎస్సై యాయతి రాజు, ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఐక్యత సందేశాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.