167 – తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్
మే 13 వ తేదీ పోలింగ్ రోజున ఉదయం 5గంటలకే అభ్యర్థులు, ఏజెంట్లు రావాలని 167 – తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ ఏజెంట్ అదే పోలింగ్ స్టేషన్ లేదా పక్కన ఉన్న పోలింగ్ స్టేషన్‌లో ఓటర్ అయి ఉండాలని తెలిపారు. తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో పోలింగ్ ఏజెంట్‌ను నియమించడంలో ఇబ్బంది ఏర్పడితే, పోలింగ్ ఏజెంట్ తప్పనిసరిగా ఎపిక్ కార్డ్ / ఎన్నికల కమిషన్ సూచించిన ఏదైనా ఇతర ప్రత్యామ్నాయ పత్రాన్ని కలిగి ఉండాలని తెలిపారు. పోలింగ్ ఏజెంట్ తన ఫోటోను అతికించి ఫారం-10లో ఒరిజినల్ నియామక పత్రాన్ని తీసుకురావాలి. ఏజెంట్లు పెన్ను, పేపర్, పెన్సిల్ మరియు ఆ పోలింగ్ స్టేషన్ యొక్క తాజా ఎలక్టోరల్ రోల్ కాపీని తీసుకురావాలని తెలిపారు.
ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరి.
ఓటు వేసేందుకు వచ్చే వారు తమ వెంట ఓటర్ గుర్తింపు కార్డు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, ఆరోగ్య భీమా స్మార్ట్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్టు, సర్వీస్ గుర్తింపు కార్డు, వికలాంగుల గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, స్మార్ట్ కార్డు(రిజిస్ట్రార్ జనరల్ జారీ చేయబడినది), పించన్ దృవీకరణ పత్రము, ఉద్యోగి గుర్తింపు కార్డు లలో ఏదో ఒకటి తప్పక తీసుకు రావాలని 167 – తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ తెలిపారు.
మాక్ పోల్ నిర్వహణ:-
పి. ఓ. 13-05-2024 ఉదయం 05.30 గంటలకు మాక్ పోల్‌ను ప్రారంభిస్తారు. కాబట్టి, పోలింగ్ ఏజెంట్లు ఉదయం 5గంటలకే పోలింగ్ కేంద్రాలు చేరుకుని ముందే రిపోర్ట్ చేయాలి. ఏజెంట్లు హాజరు కానప్పటికీ, పి.ఓ. మాక్ పోల్ నిర్వహణను కొనసాగిస్తారని 167 – తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ ఆ ప్రకటనలో తెలిపారు.