TEJA NEWS

రాజన్న జిల్లా :
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లో కార్నర్‌ మీటింగ్‌లో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు.

రాష్ట్రాలకు ప్రత్యేకంగా వాటా ఇవ్వాల్సి వస్తుం దని.. మోడీ సెస్ పన్నులు వేస్తున్నారని మండిపడ్డారు.

పెట్రోల్, డీజిల్‌పై పన్నుల రూపంలో పైసలు వసూలు చేసి.. రహదారులు వేస్తామ ని పేదల రక్తం పీల్చి 30 లక్ష ల కోట్లు దండుకున్నారని కేటీఆర్ ఆరోపించారు.

అలా దోచుకున్న ఆ 30 లక్షల కోట్లు అదానీ, అంబానీలకు పంచిపెట్టా రన్నారు. తాను చెప్పింది తప్పని బండి సంజయ్, కిషన్‌రెడ్డి నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం అంటూ కేటీఆర్ సవాల్ చేశారు.

తెల్లారేసరికి కొత్త బస్టాండ్ దగ్గర.. తెలంగాణ తల్లి సాక్షిగా రాజీనామా వారి మొహాన కొడతానం టూ కేటీఆర్ ఘాటుగా స్పందించారు..


TEJA NEWS