తెలంగాణ ఉద్యమ కమిటీ ఫోరం కమలాపూర్ మండల అధ్యక్షునిగా మౌటం సంపత్ ఎన్నిక
కమలాపూర్
కమలాపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ ఉద్యమ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ మరియు జిల్లా అధ్యక్షులు కనకం కుమారస్వామి కలిసి తెలంగాణ రాకముందు నుండి అనేక ఉద్యమాలు చేసి జేఏసీ నాయకునిగా ఉండి తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకైన పాత్ర పోషించిన మౌటం సంపత్ ను కమలాపూర్ మండల తెలంగాణ ఉద్యమ కమిటీ ఫోరం అధ్యక్షుడిగా నియమిస్తూ ఒక ప్రకటనలో తెలిపారు.
మౌటం సంపత్ మాట్లాడుతు నన్ను నియమించిన రాష్ట్ర అధ్యక్షులు సీమ శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు కనకం కుమారస్వామి మరియు మండలానికి చెందిన రాష్ట్ర కో కన్వీనర్ మోకిడ ప్రసాద్ గారికి నా సహచర ఉద్యమకారులకు చేదోడు వాదోడుగా ఉంటానని ఈ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలో ఒక గ్యారెంటీ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే దాకా ఉద్యమిస్తానని తెలియజేస్తూ ఉద్యమకారులను కలుపుకొని పోతానని తెలియజేసారు.