హైకోర్టు న్యాయవాదుల సంఘానికి ఈ నెల 30న ఎన్నికలు..

హైకోర్టు న్యాయవాదుల సంఘానికి ఈ నెల 30న ఎన్నికలు..

TEJA NEWS

అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి.

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది.

అధ్యక్ష పదవికి సీనియర్‌ న్యాయవాది చిత్తరపు రఘు, యు వేణుగోపాలరావు, కె చిదంబరం, ఉపాధ్యక్ష పదవికి రంగారెడ్డి, కృష్ణారెడ్డి, పి రామన్‌ పోటీలో ఉన్నారు.

ప్రధాన కార్యదర్శి పదవికి నలుగురు పోటీలో ఉన్నారు.

ఇతర పదవులన్నింటీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 30న ఓటింగు పూర్తయ్యాక ఫలితాలు వెలువరిస్తామని ఎన్నికల అధికారి కోదండరామిరెడ్డి చెప్పారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS