TEJA NEWS

ప్రతీ గ్రామం లో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు జరపాలి –

కమలాపూర్ :
ఎంఆర్ పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు కమలపూర్ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఎమ్మార్పీఎస్ హనుమకొండ జిల్లా కో కన్వీనర్ మరియు కమలాపూర్ మండల ఇంచార్జ్ అంకిల్ల రాజు అన్నారు . దళితులు ఉన్నత స్థాయికి ఎదగాలని సమాజంలో అందరికి సమాన హోదా పొందాలనే ఉద్దేశంతో మంద కృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ అనే ఒక ఉద్యమ సంస్థని ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. మంద కృష్ణ మాదిగ చేసిన ఉద్యమాల వల్లనే ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా దళితులకు ఒక ప్రత్యేక స్థానం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కావున ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కమలాపూర్ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో జెండా ఆవిష్కరణ చేసి దళితుల సోదరులందరూ సంబరాలు చేసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ శ్రేణులకు అంకిల్ల రాజు పిలుపునిచ్చారు.

ప్రతీ గ్రామం లో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు జరపాలి

TEJA NEWS