TEJA NEWS

ఉపాధి హామీ పథకం రోజు కూలి 700 ఇవ్వాలి :తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం

మల్కాజిగిరి
29 ఆగస్టు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పని దినాలు పెంచాలని, రోజు కూలి 700 ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోటపల్లి శంకర్ డిమాండ్ చేసారు.గురువారం మల్కాజిగిరి మండల వ్యవసాయ కార్మిక సంఘం 4వ మహాసభ జే. వెంకట రమణ అధ్యక్షతన మల్కాజిగిరి నియోజకవర్గం, వినాయక నగర్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిధిగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం(బికెఎంయు) మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోటపల్లి శంకర్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమములో ముఖ్య నాయకులు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రొయ్యల కృష్ణమూర్తి, మల్కాజిగిరి మండల టి.యాదయ్య, కాప్రా మండల కార్యదర్శి దర్శనం యాదగిరి, బికేయంయు మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు వి.స్వరూప పాల్గొన్నారు.ఈ సందర్బంగా ముఖ్య అతిధి తోటపల్లి శంకర్ మాట్లాడుతూ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరములో 200 రోజులకు పెంచి రోజు కూలి రూ 700/- లకు పెంచాలని, ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించి పని లేని కూలీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేసారు. కూలి బంధు ఏర్పాటు చేసి వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరారు, దళిత, గిరిజన, బీసీ కులాలకు పేదలకు వ్యవసాయం చేసుకోవడానికి 3 ఎకరాల సాగుభూమి కేటాయించాలని, వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని, 55 సంవత్సరాలు పైబడిన వ్యవసాయ కూలీలు ప్రతి ఒక్కరికి రూ 5000/- పెన్షన్ ఇవ్వాలని, వ్యవసాయ కూలీలకు స్వంత ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించు కోవడానికి
రూ: 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, దళిత, గిరిజన, బీసీ లకు, ఆర్థికంగా వెనక బడిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం క్రింద ఒకే సారి అందించాలని కోరారు, పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ కూలి రేట్లు పెంచాలని శంకర్ డిమాండ్ చేసారు.సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు రొయ్యల కృష్ణమూర్తి ప్రసంగిస్తు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించి నట్లయితే పట్టణ ప్రాంతాలకు వలస వచ్చిన వ్యవసాయ కూలీలకు పని దొరికే అవకాశం ఉందని వెంటనే కేంద్ర ప్రభుత్వం తో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి పోరాడి ఈ పథకాన్ని రాష్టంలో ప్రవేశపెట్టాలని, దీనివల్ల పేద ప్రజలకు పని దొరికి ఆర్థికంగా నిలదోక్కుకుంటారని అన్నారు.
అనంతరం మల్కాజిగిరి మండల వ్యవసాయం కార్మిక సంఘం(BKMU) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులు
చిలుమూరి ఆనంద్ రావు,అధ్యక్షులుగా
జే.వెంకట రమణ,ప్రధాన కార్యదర్శిగా
ఎస్.కె అజీజ్, ఉపాధ్యక్షురాలిగా ఎం.రాజేశ్వరి, సహాయ కార్యదర్సులుగా
ఆర్.శంకర్, రామకృష్ణ, రాజయ్య, కోశాధికారిగా, మజే.నాగేష్ యాదవ్, కార్యవర్గ సభ్యులుగా, బి.యాదగిరి, బి.కళమ్మా ,లను ఏక గ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమములో సీపీఐ పార్టీ నాయకులు, (బికేయంయు)నాయకులు, సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు రొయ్యల కృష్ణమూర్తి,సీపీఐ మల్కాజ్గిరి మండల కార్యదర్శి టి.యాదయ్య గౌడ్,సీపీఐ కాప్రా మండల కార్యదర్శి దర్శనం యాదగిరి, వ్యవసాయ కార్మిక సంఘం మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షురాలు వి.స్వరూప,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జే.వెంకట రమణ, ఎస్.కె అజీజ్, చిలుమూరి ఆనంద్ రావు,
బి.యాదగిరి, ఎం.రాజేశ్వరి, రాజయ్య, ఆర్.శంకర్, రామ కృష్ణ, నాగేష్ యాదవ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS