TEJA NEWS

ఎన్టీపీసి లో మత్స్యకారులకు ఉపాధి కల్పించండి గ్రామ సర్పంచ్ చింతకాయల సూజాత ముత్యాలు

పెందుర్తి నియోజకవర్గం అనకాపల్లి జీల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతి లో సూమారుగా 12000 మంది మత్స్యకారులు నివసిస్తున్నారు, చేపల వేట జీవనాధారం గా బ్రతుకుతున్నారు, ఎన్టీపీసి ఎర్పాటు చేసిన తరువాత ఎన్టీపీసి పైపులైన్లు ద్వారా మా జీవనాధారమైన ఉప్పుటేరు లో వ్యర్థ రసాయనాలు, ఫ్లయిష్ కలవడం వలన మత్స్య సంపద నశించిపోయింది అని ఎన్టీపీసి లో 2011వ సం”లో వారం రోజలు పాటు ఉపాధికోసం, మత్స్యకారులు ఎన్టీపీసి గేటు ముందు మహధర్న చేసారు

ఆ టైములో ఆనాటి జీల్లా కలెక్టర్ స్పందించి ఎన్టీపీసి అధికారులకు ,60 మంది మత్స్యకారులకు ఉపాధి ఇవ్వమని ఆదేశాలు జారీ చేశారు, నాటి నుండి నేటికి 12 సంవత్సరాలు అయినప్పటికీ ఎన్టీపీసి లో మత్స్యకారులకు రావలసిన ఉద్యోగాలు రాలేదు, ఈరోజు జరిగిన వాటాదారుల మీటింగ్ం లో గ్రామ సర్పంచ్,విశాఖ ఉమ్మడి జీల్లా సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు చింతకాయల సూజాత ముత్యాలు ఎన్టీపీసి జీఎం కి వినతిపత్రం,అందజేసినారు,మత్స్యకారులకు ఎన్టీపీసి లో ఉపాధి కల్పించాలని గ్రామ సర్పంచ్ చింతకాయల సూజాత ముత్యాలు కోరారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర మత్స్యకార నాయకులు,పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్రఉపాధ్యక్షులు,చింతకాయల ముత్యాలు, పంచాయతీ కార్యదర్శి రజిని,తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS