లోక్‌సభతోపాటు శాసనసభ ఎన్నికలు.. ఏపీలో బిగ్ డేకు సర్వం సిద్ధం..!

లోక్‌సభతోపాటు శాసనసభ ఎన్నికలు.. ఏపీలో బిగ్ డేకు సర్వం సిద్ధం..!

TEJA NEWS

ఆంధ్రప్రదేశ్‌లో బిగ్ డేకు సిద్ధం. లోక్‌సభ ఎన్నికలతోపాటు శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌కు సర్వం సంసిద్ధం చేశారు ఎన్నికల సంఘం అధికారులు. మరి కొద్ది గంటల్లో పోలింగ్‌ ప్రారంభం కానుంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ బూత్‌లకు ఈవీఎంల తరలింపు పూర్తయింది.

ఇక రేపు ఉదయం 5 గంటలకు మాక్‌ పోలింగ్ ప్రారంభం అవుతుంది. దాన్ని ఆరున్నరకల్లా ముగించి, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ చేపడతారు. ఇక ఏపీలో తొలిసారి భారీగా వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు.ఎన్నికలు సజావుగా సాగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌కి సర్వం సిద్ధమైంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. ఎన్నికల విధుల్లో మొత్తం 1,06,145 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 34 వేలకుపైగా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 14 నియోజకవర్గాలను సున్నితమైనవిగా గుర్తించారు. కేంద్ర పరిశీలకుల సూచనల మేరకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌ కుమార్ మీనా చెప్పారు.

ఉమ్మడి విజయనగరం జిల్లాలో పోలింగ్‌కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విశాఖ రేంజ్‌లోని ఐదు జిల్లాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి.. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకున్నామని విశాల్ గున్ని తెలిపారు. ఏపీలో మొత్తంగా 1.06 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. అంతర్‌ రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

జిల్లాల వారీగా పోలింగ్ ఏర్పాట్లుః
అన్నమయ్య జిల్లాః

నియోజకవర్గాలు: 06 మొత్తం ఓటర్లు : 14,26,834 పోలింగ్ బూత్‌లు: 1,609 సమస్యాత్మక కేంద్రాలు: 237 పోలింగ్ సిబ్బంది: 16,889 భద్రతా సిబ్బంది: 4,500

ఉమ్మడి కృష్ణా జిల్లాః

నియోజకవర్గాలు: 14 మొత్తం ఓటర్లు : 32,44,514 పోలింగ్ బూత్‌లు: 3,560 సమస్యాత్మక కేంద్రాలు: 1,226 పోలింగ్ సిబ్బంది: 26574 భద్రతా సిబ్బంది: 10,000

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాః

నియోజకవర్గాలు: 10 మొత్తం ఓటర్లు : 23,14,980 పోలింగ్ బూత్‌లు: 3,131 సమస్యాత్మక కేంద్రాలు: 599 పోలింగ్ సిబ్బంది: 20428 భద్రతా సిబ్బంది: 2660

గుంటూరు జిల్లాః

మొత్తం ఓటర్లు : 17,91, 543 పోలింగ్ బూత్‌లు: 1,915 సమస్యాత్మక కేంద్రాలు: 372 పోలింగ్ సిబ్బంది: 24,000 భద్రతా సిబ్బంది: 4000

పల్నాడు జిల్లాః

మొత్తం ఓటర్లు : 17,20,526 పోలింగ్ బూత్‌లు : 1,929 సమస్యాత్మక కేంద్రాలు: 551 పోలింగ్ సిబ్బంది: 15,000 భద్రతా సిబ్బంది: 4, 000

బాపట్ల జిల్లాః

మొత్తం ఓటర్లు : 15,06,354 పోలింగ్ బూత్‌లు : 1,766 సమస్యాత్మక కేంద్రాలు : 412 పోలింగ్ సిబ్బంది: 10, 943 భద్రతా సిబ్బంది : 2,026

ఉమ్మడి నెల్లూరు జిల్లాః

నియోజకవర్గాలు : 10 మొత్తం ఓటర్లు : 24,41,902 పోలింగ్ బూత్‌లు: 2,953 సమస్యాత్మక కేంద్రాలు: 572 పోలింగ్ సిబ్బంది: 14,687

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాః

నియోజకవర్గాలు : 15 మొత్తం ఓటర్లు : 40లక్షలు పోలింగ్ బూత్‌లు: 4,400 సమస్యాత్మక కేంద్రాలు: 1,000 పోలింగ్ సిబ్బంది: 39,000 భద్రతా బలగాలు : 11,000

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాః

నియోజకవర్గాలు : 19 మొత్తం ఓటర్లు : 47,88,271 పోలింగ్ బూత్‌లు: 4,861 సమస్యాత్మక కేంద్రాలు: 1,313 పోలింగ్ సిబ్బంది: 40,040 భద్రతా బలగాలు : 12,000

ఉమ్మడి ప్రకాశం జిల్లాః

నియోజకవర్గాలు : 8 మొత్తం ఓటర్లు : 19,22,470 పోలింగ్ బూత్‌లు: 2,183 సమస్యాత్మక కేంద్రాలు: 486 పోలింగ్ సిబ్బంది: 14,768 భద్రతా బలగాలు : 6,720

కడప జిల్లాః

నియోజకవర్గాలు : 7 మొత్తం ఓటర్లు : 16,39,066 పోలింగ్ కేంద్రాలు : 2,035 సమస్యాత్మక ప్రాంతాలు : 337 పోలింగ్ సిబ్బంది: 14,889 భద్రతా బలగాలు : 5,000

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాః

నియోజకవర్గాలు: 10 మొత్తం ఓటర్లు : 23,14,980 పోలింగ్ బూత్‌లు: 3,131 సమస్యాత్మక కేంద్రాలు: 599 పోలింగ్ సిబ్బంది: 20428 భద్రతా సిబ్బంది: 2660

Print Friendly, PDF & Email

TEJA NEWS