TEJA NEWS

జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు రెండు నెలల పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని రెండు నెలలు పాటు జనవరి 1, 2025 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు లేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ చేయడం గానీ ఏది ముందు జరిగితే అప్పటివరకు పొడిగింపు ఉత్తర్వులు జారీచేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం డిసెంబర్ 31, 2024 నాటికి అక్రిడిటేషన్ కార్డులు కలిగి పనిచేయుచున్న పాత్రికేయులకు మాత్రమే జనవరి 1, 2025 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు పొడిగింపు సౌకర్యం కొనసాగుతుందని ప్రకటనలో సంచాలకులు తెలియజేశారు.


TEJA NEWS