TEJA NEWS

Fertilizers and seeds required by farmers in Kharif

ఖరీఫ్ లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి- చింత ప్రభాకర్ ఎమ్మెల్యే

వానకాలం సీజన్‌ వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే, జూన్‌లోనే ఎకరానికి రూ.7,500 చొప్పున రైతుభరోసా నిధులు విడుదల చేయాలి…

ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం చెప్పులు లైన్‌లో పెట్టినట్టు, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాస్‌బుక్‌లు లైన్‌లో పెట్టే పరిస్థితి నెలకొన్నది…

నకిలీ విత్తనాలపై వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి… నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి…నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి…

రైతులకు సబ్సిడీ పై ఎరువులు, విత్తనాలు అందించి, బ్యాంకుల ద్వారా రుణాలు అందించేలా చర్యలు చేపట్టాలి…

వనగండ్ల వర్షంతో నష్టపోయిన మామిడి రైతులను, వరి ధాన్యం తడిసి నష్టపోయిన రైతాంగాన్ని నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి


TEJA NEWS