చరిత్రలోనే మొట్ట మొదటి మహిళ మంత్రి..తాను నిర్మించిన ..పల్నాడులో లో800ఏళ్లనాటి చారిత్రాత్మక ఆలయం పునర్నిర్మాణంపై పురావస్తు శాఖ ఆసక్తి..
పల్నాడు జిల్లా…
చరిత్రలో మొట్టమొదటి మహిళా మంత్రి ఆమె. అన్నదమ్ముల మధ్య రాజ్యాధికారం కోసం జరిగిన పోరుకు కారణం ఆమె. శివభక్తురాలిగా తాను పుట్టిన ఊరిలో ఆమె నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరుకుంది
పల్నాడు చరిత్రలో నాయకురాలి నాగమ్మది మర్చిపోలేని పాత్ర
మహిళా మంత్రిగా గురజాల రాజ్యాన్ని నడిపించిన ధీరత్వం ఆమెది.
పల్నాటి పౌరుషానికి ప్రతీక నాయకురాలు నాగమ్మ. ఆమె పుట్టింది దాచేపల్లి మండలం జట్టగామాలపాడు గ్రామం. 800 ఏళ్ల క్రితమే నాయకురాలు నాగమ్మ జిట్టగామాలపాడు అద్భుతమైన శివాలయం నిర్మించారు.
ఏన్నో ఏళ్లు ఇక్కడ శివారాధన జరిగింది. అయితే కాలక్రమేణ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం గర్భాలయం, అర్ధ మండపం పడిపోయి శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆలయాన్ని పునర్నిర్మించాలని పల్నాడు పరిరక్షణ సమితి ఎంతో కాలంగా పోరాడింది.
అదే విధంగా గ్రామానికే చెందిన ఎమ్మెల్సీ జంగా క్రిష్ణమూర్తి కూడా ఆలయం తిరిగి భక్తలకు అందుబాటులోకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలించలేదు. అయితే రెండు రోజుల క్రితం చరిత్ర పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి జిట్ట గామాలపాడులోని నాగమ్మ ఆలయాన్ని సందర్శించారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిని ఆలయాన్ని తిరిగి నిర్మించేందుకు ప్రభుత్వం లేదా స్థానికులు ముందుకొస్తే స్థపతిగా తాను ఉచితంగా సేవలు అందిస్తానని చెప్పారు. ఇప్పటికే ఆలయం స్థంభాలపై నంబరింగ్ జరిగింది. మరింతగా ఆలయం పాడవకముందే చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన చెప్పారు. పల్నాడు చరిత్రలో మాచర్ల, గురజాల, కారంపూడి, కంభం పాడు, జిట్టగామాలపాడు ముఖ్యమైన గ్రామాలుగా ఉన్నాయని ప్రస్తుతం వీటన్నింటిని కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని స్థానికులు ఎప్పటి నుండో కోరుతున్నారు. చారిత్రక ఆనవాళ్లు ఆ ప్రాంత సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు ఆచార వ్యవహారాలు తెలియజేస్తాయని అటువంటి ఆనవాళ్లను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.