రాయదుర్గం మీదుగా అయోధ్యకు ఐదు ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లు

రాయదుర్గం మీదుగా అయోధ్యకు ఐదు ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లు

TEJA NEWS

రాయదుర్గం మీదుగా అయోధ్యకు ఐదు ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లు.
అయోధ్యలో రామ మందిరంలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట జరిగిన సందర్భముగా యాత్రికులు ఆలయాన్ని దర్శించే నిమిత్తం నైరుతి రైల్వే ఆరు ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్లు నైరుతి రైల్వే అసిస్టెంట్ ట్రాన్స్పోర్ట్ మేనేజర్ బిఎల్ శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇవి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టర్మినల్ బెంగళూరు, మైసూరు, తుంకూరు, చిత్రదుర్గ మరియు వాస్కోడగామా నుండి అయోధ్యకు ప్రత్యేక రైలు ప్రయాణిస్తాయి. ఇందులో వాస్కోడగామా సర్వీసు మినహా మిగిలిన 5 రైళ్లు రాయదుర్గం మీదుగా ప్రయాణిస్తాయి. రాయదుర్గం ప్రాంత ప్రయాణికులు ఈ రైల్వే సర్వీసుల ద్వారా అయోధ్యకు వెళ్లి రావచ్చు. ట్రైన్ నెంబర్ 06201 సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినల్, బెంగళూరు నుండి బుధవారాలలో జనవరి 31, ఫిబ్రవరి 14 మరియు 28 తేదీలలో అయోధ్యకు బయలుదేరుతాయి. తిరిగి శనివారాలలో ఫిబ్రవరి 3, 17 మరియు మార్చి 2వ తేదీన అయోధ్య నుండి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినల్, బెంగళూరుకు నడపబడుతాయి. ఈ రైలు బెంగళూరు నుండి బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:30 కు రాయదుర్గం చేరుతుంది. 12 32 కు రాయదుర్గం జంక్షన్ నుండి బయలుదేరి శుక్రవారం రాత్రి 12:55 కు అయోధ్య చేరుకుంటుంది. శనివారం రాత్రి 9:20కు అయోధ్య నుండి బయలుదేరిన రైలు సోమవారం రాత్రి 8 గంటలకు రాయదుర్గం, మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టర్మినల్ బెంగళూరు చేరుతుంది. ట్రైన్ నెంబర్ 06202 మైసూరు- అయోధ్య- మైసూరు ఎక్స్ప్రెస్ రైలు మైసూర్ నుండి ఆదివారాలలో ఫిబ్రవరి 4 మరియు 18 వ తేదీన అయోధ్యకు బయలుదేరుతుంది. అదేవిధంగా బుధవారాలలో ఫిబ్రవరి 7 మరియు 21 తేదీలలో అయోధ్య నుండి మైసూర్ కు నడపబడుతుంది. ఆదివారం తెల్లవారుజామున 12 15 కు మైసూర్ నుండి బయలుదేరిన రైలు మధ్యాహ్నం 12:30 కు రాయదుర్గం చేరి 12 32 కు బయలుదేరుతుంది. ఈ రైలు మంగళవారం మధ్యాహ్నం 12:55 అయోధ్య చేరుతుంది. బుధవారం రాత్రి 9:20కు అయోధ్య నుండి బయలుదేరిన రైలు శుక్రవారం రాత్రి 8 గంటలకు రాయదుర్గం చేరి 8.02 కు బయలుదేరి శనివారం ఉదయం 7 గంటలకు మైసూరు చేరుతుంది. తుంకూర్ నుండి అయోధ్యకు నడపబడే ట్రైన్ నెంబర్ 06203 ఎక్స్ప్రెస్ స్పెషల్ రైలు ఫిబ్రవరి 7 మరియు 21 తేదీలలో బుధవారం తుంకూర్ నుండి బయలుదేరుతుంది. శనివారం ఫిబ్రవరి 10 మరియు 24 తేదీలలో అయోధ్య నుండి ఈ రైలు తుంకూర్ కు బయలుదేరుతుంది. తుంకూర్ లో బుధవారం తెల్లవారుజామున 5:20కు బయలుదేరిన రైలు మధ్యాహ్నం 12:30 కు రాయదుర్గం చేరి 12: 32 కు రాయదుర్గం నుండి బయలుదేరి శుక్రవారం మధ్యాహ్నం 12 55కు అయోధ్య చేరుతుంది. శనివారం రాత్రి 9:20కు అయోధ్య నుండి బయలుదేరిన రైలు సోమవారం రాత్రి 8 గంటలకు రాయదుర్గం చేరి 8:02 కు అక్కడి నుండి బయలుదేరి మంగళవారం తెల్లవారుజామున 1: 40కు తుంకూరు చేరుతుంది. నాలుగవ రైలు ట్రైన్ నెంబర్ 06204 చిత్రదుర్గం నుండి ఆదివారాలు ఫిబ్రవరి 11 మరియు 25న అయోధ్యకు బయలుదేరుతుంది. బుధవారాలలో ఫిబ్రవరి 17 మరియు 28 తేదీలలో అయోధ్య నుండి ఈ రైలు చిత్రదుర్గం కు బయలుదేరుతుంది. ఆదివారం ఉదయం 10:20కు చిత్రదుర్గం బయలుదేరి మధ్యాహ్నం 12:30 కు రాయదుర్గం వచ్చి 12 32 కు రాయదుర్గం నుండి బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 12 55కు అయోధ్య చేరుతుంది. బుధవారం రాత్రి 9:20కు అయోధ్య నుండి బయలుదేరి శుక్రవారం రాత్రి 8 గంటలకు రాయదుర్గం వచ్చి 8:02 కు అక్కడి నుండి బయలుదేరి 9:20కి చిత్రదుర్గం చేరుతుంది. ఐదవ రైలు ట్రైన్ నెంబర్ 06206 ఒకే ఒక ప్రత్యేక రైలు ఫిబ్రవరి 17న శనివారం మైసూర్ నుండి అయోధ్యకు, 20వ తేదీన మంగళవారం అయోధ్య నుండి మైసూర్ కు బయలుదేరుతుంది. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు మైసూర్ నుండి బయలుదేరిన రైలు మధ్యాహ్నం 12:58కి రాయదుర్గం వచ్చి ఒంటిగంటకు రాయదుర్గం నుండి బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 12:55 కు అయోధ్య చేరుతుంది. మంగళవారం ఉదయం 9:20 కు అయోధ్య నుండి బయలుదేరిన రైలు గురువారం సాయంత్రం 6 గంటలకు రాయదుర్గం చేరి 6:02 గంటల కు రాయదుర్గం నుండి బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 3:20కి మైసూరు చేరుకుంటుంది. మరిన్ని వివరాలకు నైరుతి రైల్వే శాఖ విడుదల చేసిన ఉత్తర్వులను పరిశీలించగలరు.

Print Friendly, PDF & Email

TEJA NEWS