TEJA NEWS

యాదాద్రి జిల్లాలో చెరువులోకి దూసుకెళ్లిన కారు: ఐదుగురు యువకులు జల సమాధి

యాదగిరి జిల్లా:
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది,అతివేగం, పొగ మంచు ఐదుగురు యువకుల ప్రాణాలను మింగేసింది. భూదాన్‌ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌ వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో కారు చెరు వులో మునిగిపో వడంతో ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమం గా ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరు కున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ఈత రాకపోవడంతో ఐదు గురు మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన ఉద యం తెల్లవారు జామున జరిగినట్టు తెలుస్తుంది,

హైదరాబాద్ హయత్ నగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన ఆరుగురు యువకులు హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్, మణికంఠలు హైదరాబాదు నుండి వలిగొండలో పార్టీ చేసుకు నేందుకు తెల్లవారుజామున హైదరాబాదు నుండి బయలుదేరారు.

భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. తెల్లవారు జామున పొగ మంచు ఉండడంతో పాటు….

చెరువు వద్ద మూల మలుపు కూడా ఉండ డంతో పొగ మంచుతో రోడ్డు కనిపించక పోవడంతో కారు అదుపుతప్పి చెరువు లోకి దూసుకుపోయింది. యువకులు బయటకు వచ్చే ప్రయత్నం చేసిన ప్పటికీ ఈత రాకపోవ డంతో జల సమాధి అయ్యారు.

ప్రమాద సమయంలో కారులో ఆరుగురు యువకులు ఉన్నారు. అందులో ఈత వచ్చిన మణికంఠ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఒడ్డుకు చేరుకున్న మణికంఠ 100 కు ఫోన్ చేశాడు.

దీంతో పోలీసులు జలాల్ పూర్ గ్రామస్తులు చెరువు నుండి కారుతోపాటు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. అయితే మణికంఠను చికిత్స కోసం హైదరాబాద్ కు పోలీసులు తరలించారు. మృతదే హాలను పోస్టుమార్టం కోసం భువనగిరి ఆసుపత్రికి తరలించారు.


TEJA NEWS