TEJA NEWS

ఎన్టీఆర్ హౌస్ టిట్కో గృహాల లో నివసించే వారికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మున్సిపల్ కమిషనర్ కి వినత పత్రం అందజేసిన కౌన్సిలర్ జంగా సుజాత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు క్లస్టర్ ఇంచార్జ్ జంగా వినాయక రావు….

ఎన్టీఆర్ హౌసింగ్ లో నివసిస్తున్న ప్రజలకి అన్ని వసతులు ఉండే విధంగా కమిషనర్ కృషి చేయాలి అక్కడ నివసించే ప్రజలకి ధైర్యం అండగా ఉండే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యాలి…

ముఖ్యంగా అక్కడ నివసించే ప్రజలు పాఠశాల లేక ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నారు అక్కడ నుంచి కొన్ని వందల మంది పిల్లలు బయట చదువుకోవడానికి వెళ్తున్నారు అంగన్వాడి కేంద్ర పాఠశాల కూడా అక్కడికి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కోరుతూ…

ఇప్పటికే ఎన్టీఆర్ హౌసింగ్ డిట్కో గృహాలలో కొన్ని వేల మంది పైగా ప్రజలు నివసిస్తున్నారు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ హౌస్ డిట్కో గృహాలల్లో నివసించే ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ లా అండ్ ఆర్డర్ ఏ అసాంఘిక సంఘటనలు జరక్కుండా పోలీస్ ప్రత్యేక బృందాలను నిర్మించటం జరిగింది…..

అ గృహాలను పరిశుభ్రంగా ఉండే విధంగా డిట్కో గృహాల్లో ఉన్నవారు కూడా ప్రతి ఒక్కరూ శుభ్రపరచుకోవాలి అంటూ..

తక్షణమే అక్కడ ప్రజలకు ఒక పాఠశాల ఒక అంగనవాడి కేంద్రం నిర్మించాలని కోరుతూ చిలకలూరిపేట పట్టణ మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన కౌన్సిలర్ జంగా సుజాత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు క్లస్టర్ ఇంచార్జ్ జంగా వినాయక రావు


TEJA NEWS