బద్రి కిచెన్స్’ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి *
పాల్గొన్న మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్*
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన బద్రి కిచెన్స్ హోటల్ ను షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొని హోటల్ యజమాని రవికుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ యువత స్వయం శక్తితో ఉపాధి మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా హోటల్ యాజమాని రవికుమార్ ను ఆయన అభినందించారు. అనంతరం రవికుమార్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ని, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ తదితరులను శాలువాతో సన్మానించారు. అదేవిధంగా హోటల్ ముందు నూతనంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ ను మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, ఎంపీటీసీలు కుమారస్వామి గౌడ్, కొమ్ము కృష్ణ, చంద్రపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు జంగ నరసింహా యాదవ్, కాంగ్రెస్ నాయకులు జిల్లెల బాల్ రెడ్డి, చించేటి కృష్ణ, నర్సింలు, లింగం, జంగయ్య, కుమార్, రాములు తదితరులు పాల్గొన్నారు..