
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
48 వ డివిజన్ లో రూ 15 లక్షల నిధులతో చేపడుతున్న సీ సీ రోడ్లు, మురుగు కాలువలు, మెట్లు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు.
గండి మహాలక్ష్మి వీధి రోడ్డులో సీ సీ రోడ్డు, సచివాలయం కొండ ప్రాంతంలో మెట్లు కాలువలకు రూ 15 లక్షల నిధులతో శంకుస్థాపనచేశారు.
ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నారన్నారు.
ప్రతి డివిజన్ లో అవసరమైన అభివృద్ధి పనులు యుద్ధప్రాధిపదికన చేపడుతున్నారని అన్నారు.
అభివృద్ధి పనులతో పాటు మౌలిక వసతుల కల్పనకు సుజనా చౌదరి పెద్దపీట వేస్తున్నారని అత్తలూరి పెదబాబు తెలిపారు
కార్యక్రమంలో ఎన్డీఏ కూటమినేతలు వేమిన నాగరాజు, దేవిన హరిప్రసాద్,దుక్కా దుర్గారావు, నారం కుర్మారావు ఏఈ ప్రసాద్,
డీ ఈ మాధవి తదితరులు పాల్గొన్నారు.
