రాజన్న సిరిసిల్ల జిల్లా.
జిల్లాలో గంజాయి తాగేవారు తస్మాత్ జాగ్రత్త.
జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకు గంజాయి కిట్లు అందుబాటులోకి.
డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో తరచు తనిఖీలు.
గంజాయి కిట్ల సహాయంతో జిల్లాలో 08 మంది పై కేసు నమోదు,390 గ్రాముల గంజాయి,05 గంజాయి సిగరెట్లు స్వాధీనం.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్., .
గంజాయి తాగే వారిని పట్టుకునేందుకు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకి గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని ప్రతి పోలీస్ స్టేషన్ లలో రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే గంజాయి టెస్ట్ నిర్వహించి వాటికి బానిసై తాగే వారిని పట్టుకోవడం జరుగుతుందన్నారు.
ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ, సిరిసిల్ల టౌన్ సి.ఐ లతో కలసి గంజాయి కిట్ల ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ .
జిల్లాలో గంజాయి కిట్ల సహాయంతో పరీక్షలు నిర్వహించి గంజాయి సేవించినవారు మరియు వారికి సరఫరా చేసిన 08 మందిపై కేసులు నమోదు చేసి 390 గ్రాముల గంజాయి ,05 గంజాయి సిగరెట్లు స్వాధీనం చేయడం జరిగిందని,గంజాయికి అలవాటు పడి తాగేవారు తస్మాత్ జాగ్రత్తగా ఉండలని హెచ్చరించారు.