TEJA NEWS

బొకేల బదులు బుక్కులు ఇవ్వండి.

కూటమి నేతలు, కార్యకర్తలకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు విజ్ఞప్తి.

మైలవరం, : తనను కలిసేందుకు వస్తున్న కూటమి నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలకు బదులు నోట్ బుక్స్, డిక్షనరీలు, లైబ్రరీ బుక్స్ ఇస్తే చాలా సంతోషిస్తానని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఒక ప్రకటనలో తెలిపారు. పుష్ప గుచ్ఛాలు, శాలువాలు, జ్ఞాపికలను తీసుకురావద్దన్నారు. తనపై ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ కలవడమే తనకు మరిచిపోలేని జ్ఞాపకమన్నారు. ఇకపై తనను కలిసేందుకు వచ్చేవారు ఏమీ తీసుకురాకపోయినా ఫర్వాలేదని అన్నారు. ఏదో ఒకటి ఫార్మాలిటీగా తీసుకురావాలనుకుంటే మాత్రం విద్యార్థులకు పనికొచ్చే నోట్ బుక్స్, డిక్షనరీలు, లైబ్రరీ బుక్స్ తీసుకొని రావాలని కోరారు. దయచేసి అందరూ ఈ విషయాన్ని గమనించాలన్నారు.


TEJA NEWS