TEJA NEWS

గణపయ్యా దీవించయ్యా

గణపతి నవరాత్రులను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని

గణపతి నవరాత్రుల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ సన్మానిస్తున్న నిర్వాహకులు

గణపతి నవరాత్రులను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కోరారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ ప్రశాంతి హిల్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన వినాయక మండపంలో నిర్వహించిన పూజ కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ రాఘవేంద్ర రావు ప్రత్యేక పూజలతో పాటుగా అన్నప్రసాద వితరణ చేపడుతున్నారు.ఈ కార్యక్రమంలో ప్రశాంతి హిల్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్,స్థానిక ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS