శ్రీ త్రిపుర భైరవీ దేవి అలంకరణలో దుర్గామాత,,
(తిరుపతి జిల్లా)
రామచంద్రాపురం
రాయల చెరువు కట్ట సమీపంలో వెలసియున్న శ్రీ శక్తి పీఠంలో మంగళవారం శ్రీ త్రిపురభైరవీ దేవి అలంకరణలో దుర్గామాత భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి కుర్తాళం పీఠాధిపతి సిద్దేశ్వర నంద మహాభారతి స్వామి పర్యవేక్షణలో పీఠాధిస్వరి రమ్యానంద భారతి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం ఘనంగా నిర్వహించారు.
అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. వివిధ రకాల పుష్పాలతో అమ్మవారికి శ్రీ త్రిపురబైరవీ దేవి గా తీర్చిదిద్దారు. అనంతరం ముత్తైదువులు సుహాసిని పూజ, పూజ్య శ్రీ మాతాజీ వారి దర్శనములు, మంత్రోపదేశములు, పూజ్య శ్రీ మాతాజీ వారి కరకములములచే భక్తులకు ప్రసాదాలను పంచిపెట్టారు. మాతాజీ అమ్మవారికి పుష్ప పూజలు గావించి, దుర్బారు సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శక్తి పీఠం ఆలయ నిర్మాణ కార్యకర్తలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.