మంచి పనులు చిరకాలం నిలుచుంటాయి
షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”
ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం కోసం శతాబ్ది టౌన్షిప్ యజమాని శ్రీనివాస్ రెడ్డి రూ. 11 లక్షల విరాళం
సమాజంలో చేసిన మంచి పనులే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన పునర్నిర్మాణానికి శతాబ్ది టౌన్షిప్ యజమాని శ్రీనివాస్ రెడ్డి భారీ విరాళం రూ. 11 లక్షలు చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శతాబ్ది టౌన్షిప్ యజమాని శ్రీనివాస్ రెడ్డికి శాలువా వేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. డబ్బు హోదా పేరు పలుకుబడి ఏవి వెంట రావని చేసిన సత్కార్యాలు మాత్రం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయని ఎమ్మెల్యే అన్నారు. ఏ విషయమైనా మనకెందుకులే అంటే అక్కడే నిలిచిపోతామని ఒక అడుగు ఎవరో ఒకరు ముందుకు వేసి మంచి పనుల కోసం వస్తే సత్కార్యాలు సాధించవచ్చు అని అన్నారు.
ఒక వ్యక్తికి పేరు పలుకుబడి పదవి గొప్ప పేరు తేవని ఆ పేరు పరుగుబడి హోదాతో చేసే గొప్ప పనులు పేరు తెస్తాయని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ ప్రాంత ప్రజల బిడ్డలు అత్యుత్తమంగా విద్యను అభ్యసించడానికి చేస్తున్న ప్రయత్నం ఇది అన్నారు. ఇలాంటి స్వార్థం లాభం ఆలోచించకుండా కళాశాల నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్న తరుణంలో వారికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి ఇలాంటివారు కోటర్ రూపాయలు సంపాదించినప్పటికీ అందులో కొంత ప్రజల కోసం సమాజం కోసం వెచ్చిస్తుండడం గొప్ప విషయమని మనస్ఫూర్తిగా అభినందించారు. స్థానిక కళాశాల భవన నిర్మాణంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకొని ఈ కళాశాల గర్వంగా మనదేనని చాటి చెప్పేందుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఇలాంటి సత్కార్యాలు సాధిస్తున్న స్థానిక ఎమ్మెల్యేను శతాబ్ది టౌన్షిప్ యజమాని శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, మాజీ జెడ్పిటిసి కందివనం సూర్యప్రకాష్, చెంది తిరుపతిరెడ్డి చెన్నయ్య, జమ్రుద్ ఖాన్, బాలరాజు గౌడ్, డంగు శ్రీనివాస్ యాదవ్, రాఘవేందర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, మహమ్మద్ ఇబ్రహీం, నడి కూడా యాదగిరి యాదవ్, మనపాటి ప్రదీప్ కుమార్, రమేష్, లింగారెడ్డిగూడెం అశోక్ తదితరులు పాల్గొన్నారు..