ఏపీలో రైతులకు గుడ్ న్యూస్
అమరావతీ :
ఆంధ్ర ప్రదేశ్ లో రైతులు అడిగిన వెంటనే సూక్ష్మసేద్యం పథకం మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇక అవసరం ఉన్న ప్రతి రైతుకు
ఈ పథకాన్ని వర్తింపజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రైతు తనవాటా మొత్తం చెల్లిస్తే వెంటనే పరికరాలు బిగించేలా కొత్త పథకాన్ని నేటి (శుక్రవారం) నుంచే అమలు చేయనుంది. 7.50 లక్షల ఎకరాలలో సూక్ష్మసేద్యం అమలుకు అధికారులు నిర్ణయించారు.