TEJA NEWS

Government notices to mothers who do not pay fees

ఫీజు చెల్లించని తల్లులకు ప్రభుత్వం నోటీసులు

విద్యాదీవెన కింద తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ నగదును చాలా మంది కాలేజీలకు చెల్లించడం లేదు.

దీంతో తల్లులకు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది.

నగదు జమ అయిన 7 రోజుల్లోపు చెల్లించని వారికి.. తదుపరి విడత మొత్తం కళాశాలలకే జమ చేస్తామంది.

ఫీజు కట్టకపోయినా కట్టినట్లు తప్పుడు సమాచారమిస్తే చర్యలు తీసుకుంటామంది.


TEJA NEWS