ప్రేమతో ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చని ప్రపంచానికి చాటిన మహానుభావుడు శ్రీకృష్ణుడు : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద
ఘనంగా 12వ మహా మంత్ర నామోచ్చరణ కార్యక్రమం..
ఈరోజు 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ వెంకట్రామిరెడ్డి నగర్ లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ మరియు హైదరాబాద్ ఒడిస్సా అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన 12వ మహా మంత్ర ఉచ్చరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గారు మాట్లాడుతూ శ్రీకృష్ణ భగవానుడు కేవలం దేవుడు మాత్రమే కాదని తాను సమస్తమని అన్నారు. శ్రీకృష్ణ భగవానుడి జీవితం నేటి సమాజానికి గొప్ప సందేశాన్ని అందిస్తుందని ఎటువంటి సమస్యనైనా ప్రేమ, ఓపికలతో జయించవచ్చని ప్రపంచానికి చాటిన మహానుభావుడన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం అధ్యక్షులు కనకరాజు, సంక్షేమ సంఘం అధ్యక్షులు సతీష్ గట్టోజి, బి ఆర్ ఎస్ నాయకులు కార్తీక్ గౌడ్, రషీద్, రామకృష్ణ, తేజ, సంతోష్, రమ్మీ గౌడ్, నిహార్, హైదరాబాద్ ఒడిస్సా అసోసియేషన్ సభ్యులు రమేష్, సత్య రంజన్, మున్నా, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.