నిబంధనల మేరకు లేఔట్లకు అనుమతులు మంజూరు
*తుడా ఉపాధ్యక్షులు ఎన్. మౌర్య
తిరుపతి పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఏర్పాటు చేస్తున్న లేఔట్లకు నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య తుడా అధికారులను ఆదేశించారు. తుడా పరిధిలోని రేణిగుంట, వడమాలపేట, చంద్రగిరి వద్ద ఏర్పాటు చేసిన లేఔట్లలో కల్పించిన వసతులను తుడా అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య మాట్లాడుతూ తుడా పరిధిలో ఏర్పాటు చేస్తున్న లేఔట్లకు అధికారులు స్వయంగా వెళ్లాలని అన్నారు. అక్కడ మన నిబంధనల మేరకు వారు సమర్పించిన ప్లాన్ ప్రకారం అన్ని ఉన్నాయా? లేదా అని క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. ముఖ్యంగా లేఔట్ లో ప్లాట్ల మధ్య రోడ్లు, డ్రైన్లు, ఓపెన్ స్పేస్, ఎలక్ట్రికల్ లైన్స్, నీటి సౌకర్యం ఉందా అని పరిశీలించాలని అన్నారు. ఆలా నిబంధనలకు అనుగుణంగా అన్ని ఉన్న లేఔట్లకు మాత్రమే అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. అలా కాకుండా అనుమతులు మంజూరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ పరిశీలనలో సిపిఓ దేవి కుమారి, ఏపిఓ సూర్యనారాయణమ్మ, జె పి ఓ లు, ఇతర ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు.
నిబంధనల మేరకు లేఔట్లకు అనుమతులు మంజూరు
Related Posts
పేదల బియ్యం.. మాఫియాకు వరంగా మారాయి
TEJA NEWS పేదల బియ్యం.. మాఫియాకు వరంగా మారాయి రేషన్ బియ్యం అక్రమ రవాణాను ప్రజలు అడ్డుకోవాలి కూటమి ప్రభుత్వానికి తలవంపులు తెచ్చే ఏ పనిని సహించం జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి చిలకలూరిపేట:కూటమి ప్రభుత్వానికి తలవంపులు…
పంచాయితీరాజ్ – రూరల్ డెవలప్మెండ్
TEJA NEWS పంచాయితీరాజ్ – రూరల్ డెవలప్మెండ్ అనకాపల్లి జిల్లా పరవాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పరవాడ మండల ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు అధ్యక్షతన గ్రామ పంచాయితీ అభివృద్ధి ప్రణాళిక జి.ఆర్. డి.పి తయారీ పై…