TEJA NEWS

రైతుల భూ సమస్యలను తీర్చడానికి తీసుకొచ్చి గొప్ప చట్టం భూ భారతి చట్టమన్న ఎమ్మెల్యే నాగరాజు …

భూభారతి చట్టంలోని అప్పీలు ద్వారా భూ సమస్యలకు పరిష్కారన్న ఎమ్మెల్యే నాగరాజు …

ప్రజా ప్రభుత్వం ప్రజల వద్దకే పాలనలో భాగంగా రైతుల కోసం గ్రామాలకు తరలివచ్చిన అధికారులు…

హన్మకొండ జిల్లా…. భూభారతి నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూ భారతీ సదస్సు కార్యక్రమంలో భాగంగా నేడు ఐనవోలు మండల పరిధిలోని పున్నెల్ గ్రామంలో జరిగిన రెవిన్యూ సదస్సులో హన్మకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య , టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు తో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ….

తొలుత ఎమ్మెల్యే నాగరాజు కి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు…

అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు చైర్మన్ మార్నేని ..

భూ భారతి రెవెన్యు సదస్సులో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ ల వద్ద సదుపాయాలను పరిశీలించి, రైతులు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేస్తున్న ఎమ్మెల్యే నాగరాజు ….

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:-…

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా అనేకమంది పేద రైతులు ఇబ్బందులకు గురయ్యారని వేల ఎకరాల భూములు గల్లంతయ్యాయని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురానున్న భూభారతి చట్టం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు..

గతంలో ఉన్న ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు మేధావులు, రైతు సంఘాలు, అందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ కొత్త చట్టం భూ భారతిని తీసుకు వచ్చిందన్నారు. లోపభూయిష్టంగా ఉన్న ధరణి వల్ల పట్టా జారీలో ఏదేని పొరపాటు జరిగితే అప్పీలు చేయడానికి ఆవకాశం లేదని, రైతులు సివిల్ కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేదని దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారం లోకి వస్తే ధరణి స్థానంలో భూ భారతి తెస్తామని చెప్పిన ప్రకారం సీనియర్ అధికారులతో అన్ని రాష్ట్రాల్లో విచారణ చేసి సులువైన పటిష్టమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు.

భూములు కొన్నా, అమ్మినా లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా హద్దులతో మ్యాపు తయారు చేసి పట్టాదారు పాసు పుస్తకాల్లో నమోదు చేస్తారని తద్వారా భూమి గుర్తింపుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. తహసీల్దార్ ద్వారా ఏదేని పొరపాటు జరిగితే ఆర్డిఓ, ఆర్డిఓ నుండి కలెక్టర్, కలెక్టర్ నుండి భూ ట్రిబ్యునల్ నకు వెళ్ళడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఉచిత న్యాయ సహాయ సేవలు అందించడానికి అవకాశం కల్పించారని అన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన రికార్డుల నవీకరణలను చేయడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రజలకు ఆధార్ ఎలా ఉందో అలానే భూములకు భూదార్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సదస్సుల్లో దరఖాస్తు చేసుకున్న వారికి దరఖాస్తులను పరిశీలించి వచ్చే నెల జూన్ 2 న పట్టా పాస్ పుస్తకాలను అందజేయనున్నట్లు ఎమ్మెల్యే నాగరాజు సభ ముఖంగా తెలిపారు…

అలాగే మీకు ఏ సమస్య నా డయల్ యువర్ ఎమ్మెల్యే 8096107107 సమస్యలను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు…

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విక్రమ్, రెవిన్యూ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరలు పాల్గొన్నారు…..