TEJA NEWS

కెపిహెచ్పి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేపిహెచ్పి డివిజన్లోని ప్రభుత్వాసుపత్రి నిర్మించాలని నిరసన వ్యక్తం చేశారు ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రెండు సంవత్సరాల క్రితం గత మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు .. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా 36 కోట్ల రూపాయల వ్యయంతో ఒక ఎకరా 17 గుంటల స్థలం లో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించేందుకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆనాటి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన పని ఏంటంటే ఫౌండేషన్ రాయి బద్దలు కొట్టడం తప్ప కనీసం ప్రజలకు ఉపయోగపడే ఆసుపత్రి నిర్మించాలన్న జ్ఞానం లేదని.. అంతేకాకుండా 3వ ఫేస్ లో ఉన్నటువంటి రమ్య గ్రౌండ్ వద్ద సొంత నిధులతో తాను స్కూల్ నిర్మిస్తానన్నా ఒక్క అడుగు ముందుకు కదలనివ్వడం లేదని ఇప్పటికే కోటి రూపాయలు ఖర్చు చేశామని.. ఆ స్థలం కూడా స్వాధీనం పరుచుకోకుండా తాత్సారం చేస్తున్నారని..

కలెక్టర్ కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా ముందుకు వెళ్లడం లేదని.. అంటే ప్రజలకు ఉపయోగపడే పనులను అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ పని అంటూ నిరసన వ్యక్తం చేశారు.. ఇప్పటికైనా తెలుసుకొని ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలని.. అత్యధిక జనాభా ఉండే కెపిహెచ్బి డివిజన్లో ఆసుపత్రి లేక నిరుపేదలు చాలా అల్లాడుతున్నారని అన్నారు.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆనాడు ప్రజలకు ఉపయోగపడే పనులు కోసం తహతహలాడే వారిని.. అందుకనే రమ్యా గ్రౌండు వద్ద స్కూల్ నిర్మించుకుని దానికి నందమూరి తారక రామారావు పేరు పెట్టేందుకు కూడా అప్పుడు కలెక్టర్ అనుమతి తీసుకున్నారని.. ఈ వంద పడకల ఆసుపత్రి కూడా పూర్తయితే ప్రజలకు ఎంతో మేలు జరిగేదని అన్నారు.. ఎట్టి పరిస్థితుల్లో ఆసుపత్రి నిర్మించి తీరాలని.. లేనియెడల తమ నిరసన ఉదృతం చేస్తామని కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు హెచ్చరించారు… ఈ కార్యక్రమంలో సురేష్ రెడ్డి, వెంకటరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు.