
పేదవారి ఆత్మగౌరవ ప్రతీక సొంత ఇల్లు..
పార్టీలకు అతీతంగా లబ్దిదారులకు ఇందిరమ్మ ఇల్ల పంపిణీ….
పేద ప్రజలందరికీ గూడు, నీడ కల్పించడం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం…
పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసిన ఎమ్మెల్యే నాగరాజు …
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరగా ఇండ్లు నిర్మించుకోవాలి..
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాగరాజు గారు…
హన్మకొండ జిల్లా… వర్ధన్నపేట టౌన్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు వర్ధన్నపేట మండల, టౌన్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల సుమారు 200 లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ….
అనంతరం వ్యవసాయ శాఖ తరుపున రైతులకు నాణ్యమైన విత్తనాల ప్యాకెట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాగరాజు …
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:-…
పేదవారి ఆత్మగౌరవ ప్రతీక సొంత ఇల్లు అని తాము ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలం, భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నిర్ణీత సమయం, ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం ఇల్లు నిర్మించుకొని సహాయం పొందాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసే సమయంలో ఏదో ఒక సారి మీ ఇంటికి వస్తానని, ఒక తోబుట్టువు వలె అండగా ఉంటానని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశలలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని, 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల లోపు ఇంటి నిర్మాణం చేసుకోవాలని స్పష్టం చేశారు. 4 దశలో గ్రీన్ చానల్ ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని వెల్లడించారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తైన తర్వాత లక్ష రూపాయలు, గోడలు నిర్మిస్తే లక్ష రూపాయలు, స్లాబ్ నిర్మించిన తరువాత 2 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో లక్ష రూపాయలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తున్నారని, గత ప్రభుత్వం పెట్టిన ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా వాటిని కొనసాగిస్తూ.. నూతన పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 కు సిలిండర్, 10 లక్షల ఆరోగ్య శ్రీ, నూతన రేషన్ కార్డులు, సన్నం బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రైతులకు ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. గురుకులాల్లో ఒకే రకమైన భోజనం అందించాలని కామన్ డైట్ ప్రోగ్రాం అమలు చేస్తున్నామని.. గురుకులాల్లో డైట్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచడం జరిగిందని తెలిపారు. గత పది సంవత్సరాలుగా వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రజలు ఎంతగానో ఇండ్ల కోసం ఎదురు చూశారని.. కానీ ప్రజాప్రభుత్వం వచ్చిన 15 నెలల్లోనే ఇండ్ల పత్రాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఇండ్ల మంజూరు పత్రాలను అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియచేశారూ….
లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకునేందుకు మహిళా సంఘాల ద్వారా అప్పు ఇప్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారుల్లో ఎవరికైనా బ్యాంకు ఖాతాలు లేనట్లయితే తన సొంత ఖర్చలతో బ్యాంకు ఖాతాను తీసి ఇచ్చే విధంగా తోడ్పాటున అందిస్తానని పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల చెందిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలనుకుంటున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు అభినందనలు తెలిపారు…
గత ప్రభుత్వంలో హయాంలో పోలీస్ ఉద్యోగానికి ఎంపిక అయినా కూడా కొన్ని అనివార్య కారణాలవల్ల పోలీస్ శాఖ వారు తిరస్కరించగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేక జీవో తీసుకొచ్చే విధంగా కృషిచేసి గడ్డం శ్రీకాంత్ కు ఉద్యోగం వచ్చే విధంగా కృషి చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ని కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు….
గత 10 బిఆర్ఎస్ ప్రభుత్వం దోచుకున్న సొమ్ము అంతా సోషల్ మీడియాలో పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద బుద్ధి జల్లే ప్రయత్నం చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ నాటకాలు ఆడుతూ ఇప్పుడు కొత్తగా లిక్కర్ రాని అలియాస్ కవిత మళ్లీ తెలంగాణలో దోచుకునేందుకు జాగృతి అని మళ్ళీ తెర మీదికి వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలు మీ మాటలు విని మోసపోవడానికి ఎవరు లేరు మా నాయకుడు రేవంత్ రెడ్డి ని విమర్శించే ముందు ఒకసారి నిన్ను నువ్వు ఆలోచించుకో కవిత తస్మాత్ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకుంటే తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎవరు క్షమించరు అయ్యా బిడ్డ కలిసి ఆడుతున్న నాటకాలన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు మీ పార్టీకి పుట్టగతులు లేకుండా ప్రజలు తగిన బుద్ధి చెప్పిన కూడా మీకు సిగ్గు రావడంలేదన్నారు.
అలాగే మీకు ఏ సమస్య ఉన్న నా డయల్ యువర్ ఎమ్మెల్యే 8096107107 కి ఫోన్ చేసి మీ సమస్య తెలియజేసే త్వరితగతన మీ సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తాను అన్నారు..
ఈ కార్యక్రమంలో హన్మకొండ జెడ్పీ సీఈఓ, డిసివో, హౌసింగ్ పీడీ, ఎంపీడీవో వివిధ శాఖల అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు….
