TEJA NEWS

బీజేపీ జిల్లా కార్యాలయంలో గుండ్ర మధుమోహన్ రెడ్డి ని బీజేపీ రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కో-కన్వీనర్ గా నియమిస్తూ బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి నియామక పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కె. మల్లేష్ యాదవ్ , బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి , శంకరపల్లి మునిసిపల్ అధ్యక్షులు బీర్ల సురేష్ , ప్రధాన కార్యదర్శి మోరంగపల్లి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మధుమోహన్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతం, ఆదర్శలకు అంకితమై, నీతి, నిజాయితీ, నిబద్దత, క్రమశిక్షణ, చిత్తశుద్ధి తో వ్యవహారిస్తానని, సహచర కార్యకర్తలు, పార్టీ కమిటీలతో కలిసి అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటాను అని అన్నారు.


TEJA NEWS