TEJA NEWS

పత్రికా ప్రకటన.
13.01.2024.

తెలుగు లోగిళ్లలో ఆనందాలు పంచే సంక్రాంతి

ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

-మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్

ఎన్టీఆర్ జిల్లా,

తెలుగు లోగిళ్లలో ఆనందాలు పంచే సంక్రాంతిని సంప్రదాయం ప్రకారం అందరూ ఘనంగా జరుపుకోవాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు. ఈ మేరకు మైలవరం పట్టణంలోని శాసనసభ్యుని కార్యాలయం నుంచి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

మైలవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు సంక్షేమం కోసం సుమారు రూ.1200 కోట్లకు పైగా చెల్లించినట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులకు దాదాపు రూ.300 కోట్లకు పైగా మంజూరు చేశామని తెలిపారు. నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 20 వేల మందికి పైగా ఇళ్లస్థలాలను ఇచ్చామన్నారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తి కొలదీ సాధ్యమైనంత మేరకు ఎక్కువగా నిధులు మంజూరు చేయించాన్నారు. నీతి, నిజాయితీలతో అవినీతి రహితంగా పారదర్శక పాలన అందించినట్లు పేర్కొన్నారు. ప్రజలు జూద క్రీడలకు దూరంగా ఉంటూ సంప్రదాయ క్రీడల్లో పాల్గొంటూ సంక్రాంతి పండుగను అన్ని కుటుంబాలు సంతోషంగా జరుపుకోవాలన్నారు. భగవంతుని ఆశీస్సులతో అందరికీ శుభం జరగాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు.


TEJA NEWS