TEJA NEWS

132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ లో, శ్రీ దుర్గా మాత ఆలయ పునర్ నిర్మాణానికి సహకరించమని రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు,పెద్దలు,
శ్రీ కె.యం ప్రతాప్ ని మరియు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, యువ నేస్తం ఫౌండేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కె.పి. విశాల్ గౌడ్ ని కోరిన దుర్గామాత ఆలయ కమిటీ సభ్యులు.
ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ, శ్రీ దుర్గా మాత ఆలయ పునర్ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు,
గతంలో కూడా వినాయక్ నగర్ ని అభివృద్ధి పరిచామన్నారు.
వినాయక్ నగర్ ఆలయ కమిటీ వారికి,సంక్షేమ సంఘం వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు.
ఈ కార్యక్రమంలో వినాయక నగర్ ఆలయ కమిటీ సభ్యులు నర్సింగరావు,నదీమ్రాయి, యాదగిరి,వెంకటయ్య, చంద్రయ్య, సుధాకర్, నందు సింగ్, మురళి, పాండు, నాగరాజు, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS