TEJA NEWS

ఇంటింటా ‘రామ జ్యోతి’.. ఈ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి

అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తి అయ్యింది. శ్రీరామోత్సవం కసం మొత్తం నగరాన్ని ఎంతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అలాగే దేశ నలుమూలల నుంచి అనేక మంది ముఖ్య అతిథితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐదు శతాబ్దాల సుధీర్ఘ నీరీక్షణ సాకారం అయ్యింది. ఎన్నో దశాబ్దాలు పోరాటం వెరసి అయోధ్యలో భవ్య రామ మందిరం కల సాకారం అయ్యింది. ఈ అద్భుత క్షణాల కోసం ఎంతో మంది రామ భక్తులు ఎన్నో శతాబ్దాలుగా ఎదురు చూశారు.

కాగా ఈరోజు సాయంత్రం ప్రతి ఇంట్లో రామ జ్యోతిని వెలిగించాలని పిలుపునిచ్చారు. మరి ఇంతకీ ఈ రామ జ్యోతిని ఎలా వెలిగించాలి? ఏ సమయానికి వెలిగించాలి? అనే డౌట్లు వచ్చే ఉంటాయి. ప్రాణ ప్రతిష్ఠ రోజున అంటే సోమవారం సాయత్రం రామ జ్యోతిని వెలిగిస్తారు. మీరు కూడా రామ జ్యోతి వెలిగించాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు నెయ్యి దీపాన్ని వెలిగించడం మంచిది.

ఎన్ని వెలిగించాలి?

ఎవరి నమ్మకాన్ని బట్టి.. ఒక దీపం అయినా వెలిగించవచ్చు. లేదా ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు. ఇది మీ కుటుంబం మొత్తానికి శ్రీరాముడి అనుగ్రహాన్ని తీసుకు వస్తుందని, జీవితంలో ఆనందం, శాంతిని తెస్తుందని నమ్ముతారు.

దీపాన్ని ఎక్కడ ఉంచాలి?

అదే విధంగా ఈ దీపాలను ఎక్కడ పెట్టాలి అనే సందేహం కూడా చాలా మందికి నెలకొంది. రామ జ్యోతి దీపాలను ఇంటి ముందు లేదా తులసి మొక్క దగ్గరైనా పెట్టుకోవచ్చు. ఈ ఐదు దీపాలను తయారు చేసి వంటగదిలో ఒకటి, ఇంటి ప్రధాన ద్వారం వద్ద రెండు, ఆవరణలో ఒకటి, తులసి మొక్క దగ్గర ఒకటి ఇలా ఎక్కడైనా పెట్టవచ్చు.

ఏ సమయానికి వెలిగించాలి?

రామ జ్యోతి దీపాన్ని ఏ సమయానికి వెలిగించాలి? అనే సందేహాలు కూడా చాలా మందికి ఉంటాయి. ఈ రామ జ్యోతి దీపాన్ని సాయంత్రం ఐదు గంటలు లేదా 6 గంటల సమయంలో వెలిగించుకోవచ్చు.

బాల రాముడి ఆగమనం సందర్భంగా ఇంట్లో ఇలా చేయడం వల్ల.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. ఇంటి వాతావరణం పవిత్రంగా మారుతుంది. వీలైనంత వరకు పేదలకు పండ్లు, అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.


TEJA NEWS