ఐకేపీ లో అడ్డగోలుగా కాంటాలు – సీరియల్ తో పనిలేకుండా నిర్వహణధాన్యం

TEJA NEWS

ఐకేపీ లో అడ్డగోలుగా కాంటాలు – సీరియల్ తో పనిలేకుండా నిర్వహణ
ధాన్యం రాశుల వద్ద పడిగాపులు కాస్తున్న గర్భిణీ స్త్రీ
ఐకేపీ లో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్న కాంటా వేయని సిబ్బంది


సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలోని ఐకేపీ సెంటర్ 1 కేంద్రం లో నెలల తరబడి ధాన్యం కొనుగోలుకు నోచుకోకుండా ఉన్నాయి. ఐనా ఐకేపీ సిబ్బంది నామమాత్రంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
ఐకేపీ లోనే ధాన్యం తడిసి పోతున్నా కనీసం టార్పిన్లు ఇచ్చే పరిస్థితి లేకుండా ఉందన్ని ఐకేపీ కి ముందుగా తెచ్చిన దాన్యాన్ని కాకుండా ఆలస్యంగా తీసుకొచ్చిన వారికి కాంటాలు వేస్తున్నారని అన్నారు. తమ వడ్లు ఐకేపీ కేంద్రానికి తీసుకొచ్చి సుమారు నెల రోజులు గడుస్తున్న కంటా వేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని సగటు రైతు (గర్భిణీ స్త్రీ) ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి అట్టి ఐకేపీ కేంద్రాలపై తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page