TEJA NEWS

కాలువల్లో చెత్త వేస్తే జరిమానాలు విధించండి.
పెండింగ్ పన్నులు వసూలు చేయండి.*
కమిషనర్ ఎన్.మౌర్య

నగరంలోని మురుగునీటి కాలువల్లో, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలో పారిశుద్ధ్య పనులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పన్నుల వసూళ్లు, అభివృద్ధి పనులు తదితర అంశాలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అన్ని వినతులను పరిష్కరించాలని అన్నారు. నగరపాలక సంస్థ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న అన్ని పన్నులను వసూలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మురుగునీటి కాలువల్లో, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్నట్లు ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించాలని హెల్త్ అధికారులను ఆదేశించారు. ఇంటింటి చెత్త సేకరణ పక్కగా చేపట్టాలని అన్నారు. నగరంలో ఎక్కడైనా చెత్త కనిపిస్తే ఆయా ప్రాంతాల్లోని అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని ప్రాంతాల్లో ప్రజలకు త్రాగునీరు నిర్ణీత సమయంలో సరఫరా చేయాలని అన్నారు. అలాగే డ్రెయినేజీ కాలువల్లో ఎప్పటికప్పుడు మట్టి, చెత్త తొలగించే పనులు చేపట్టాలని అన్నారు. సిసి రోడ్లు నిర్మాణం, డ్రెయినేజీ కాలువల మరమ్మత్తులు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో వీధికుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని వెటర్నరీ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్స్ సేతు మాధవ్, రవి, డి.సి.పి. మహాపతి, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి, డి . ఈ.లు, ఏ.సి.పి.లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు ఉన్నారు.


TEJA NEWS