ఆకట్టుకున్న వేస్ట్ టు ఆర్ట్ ప్రదర్శనలు
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేస్ట్ టు ఆర్ట్, వెస్ట్ టు వండర్ పోటీలకు విశేష స్పందన లభించింది. స్థానిక కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొని పనికిరాని వాటితో తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్బంగా కమిషనర్ ఎన్.మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛత ఐ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ పోటీలు నిర్వహించామన్నారు. వేస్ట్ తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. చెత్తను వేరు చేసి తమ సిబ్బందికి ఇస్తే వాటిని రిసైకిల్ చేసేందుకు వీలుంటుందని అన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు పూర్తిగా తగ్గించాలన్నారు. పిల్లలు ఎంతో వేస్ట్ తో ఉపయోగకరమైన వస్తువులు తయారు చేయడం అబ్బుర పరిచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మునిసిపల్ ఇంజినీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, డి. ఈ. విజయకుమార్, మహేష్,రాజు, సంజయకుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి, మస్తాన్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,