TEJA NEWS

ఘనంగా శ్రీ శ్రీ శ్రీ దానప్ప తల్లి అమ్మవారి సారే, మూర్రాట పండుగ మహోత్సవం

కూర్మన్నపాలెం: జీవీఎంసీ 87 వార్డు పరిధిలో గల వడ్లపూడి దుగ్గపువానిపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ దానప్పతల్లి సారి మూర్రాట కార్యక్రమం ఉదయం 7.30 నిముషాలు నుండి ప్రారంభమైంది వడ్లపూడి, దుగ్గపువానిపాలెం, కాశీపాలెం, కణితి, సంత మామిడి తోట మీదగా సారీ ఊరేగింపు లో 108 కళాశాలు, 508 రకాల స్వీట్లు తో ఊరేగింపు జరిగినది ,కాలనీ లో ఉన్న వివిధ గ్రామం లో ఉన్న భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఊరేగింపుగా అమ్మవారికి సారి, మూర్రాట అమ్మవారి గుడి దగ్గర జరిగింది అలాగే పూజలు పాలాభిషేకాలు కుంకుమ పూజలు ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, మరియు చింతలపూడి వెంకటరామయ్య, కార్పొరేటర్లు గుడివాడ లతీషు బోండా జగన్ సింహాద్రి ప్రోప్రైటర్ చిగులపల్లి రవి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

అనంతరం ” భారీ అన్న సమారాధన ” ప్రారంభించారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డివి అప్పారావు, సరళ కొండలరావు, ప్రగడ వేణుబాబు, బొడ్డ గోవిందా, దుగ్గపు దానప్పలు, బొడ్డ సన్యాసిరావు, ప్రగడ శ్రీనివాస్, పూడి ఆనంద్, పిన్నింటి సంతోష్ ,బి అప్పల సత్యం,మార్పు శేషు, అప్పిని సన్యాసిరావు, బోండా గోవిందరాజులు, కాశీ పాలెం యూత్ దుగ్గపాలెం యూత్ కణిత యూత్ ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS