నారాయణపేట జిల్లాలో ఎండల తీవ్రతకు చిరుతపులి మృతి

నారాయణపేట జిల్లాలో ఎండల తీవ్రతకు చిరుతపులి మృతి

TEJA NEWS

నారాయణపేట జిల్లా:
తెలంగాణ అంతటా ఉష్ణోగ్ర తలు విపరీతంగా పెరిగిపో యాయి. వేడిగాలులతో జనాలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వేడిగాలులతో ప్రజలే కాదు.. వన్యప్రాణు లు కూడా తట్టుకోలేకపోతు న్నాయి.

ఓవైపు రోజురోజుకు పెరుగు తోన్న వేడితో.. ఇంట్లో ఉండాలంటేనే జనాలు భయపడుతున్నారు. ఈ ఎండలకు తట్టుకోలేక ప్రజలు వడదెబ్బలకు గురవుతున్నారు. మరి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.

అలాగే, పెరుగుతోన్న ఎండలకు జంతువులు కూడా మరణించడం కలకలం రేపుతోంది. తాజాగా నారాయణపేట జిల్లా మద్దూరు మండలం జాదవరావుపల్లిలో చిరు తపులి మృతి చెందిన ఘటన వెలుగుచూసింది.

అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దూరులోని కాలిపోయిన వరి పొలాల్లో చిరుతపులి చనిపోయి కనిపించింది. వృక్షసంపద లేని ప్రాంతం కావడంతో.. వన్యప్రాణులు తలదాచకునేందుకు కనీసం నీడ కూడా లేదంంట.

దీంతో జంతువుల మనుగడ పెను సవాలుగా మారిందని నారాయణపేట డీఎఫ్‌వో వీణ్ వాణి ఆవేదన వ్యక్తం చేశారు.

మద్దూరు రెవెన్యూ భూమి లో కనీసం నాలుగు చిరుత లు ఉంటాయని, ఇవి నివసించే గుట్టల్లో చెట్లు లేకపోవడంతో వేడిగాలు లతో విపరీతంగా ఇబ్బం దులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే వేడి తట్టుకోలేక చిరుతపులి మృతి చెందింది

Print Friendly, PDF & Email

TEJA NEWS