TEJA NEWS

శంకర్‌పల్లి మండల మరియు మున్సిపల్ పరిధిలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణ పరిధి రైల్వే స్టేషన్ పక్కన గల రామమందిరంలో భారతిబాయి దశరథ్, విజయబాబు దశరథ్ దంపతులు సీతారాముల కళ్యాణంలో పాల్గొని, పురోహితులు రాజేశ్వర్ జోషి ఆధ్వర్యంలో స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.
మండల పరిధి సంకేపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో చేవెళ్ల నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంధువులు డాక్టర్ సాధన శ్రీ సీతారాముల స్వాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం రామాలయం నుండి హనుమాన్ దేవాలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. జైశ్రీరామ్ నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి బీమ్ భరత్, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్, ఉపాధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, కౌన్సిలర్లు వాణి ప్రకాష్, శ్రీనాథ్ గౌడ్, రజిని శ్రీనివాస్, సంధ్యారాణి అశోక్ కుమార్, సీనియర్ నాయకులు పరమేశ్వర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, వాసుదేవ్ కన్నా, మాజీ ఎంపీటీసీ ఎజాస్, కృష్ణారెడ్డి, సురేష్ యాదవ్, వీరేందర్, లోకేష్, రాజ్ కుమార్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.


TEJA NEWS