TEJA NEWS

Incorrect pay slips for district government hospital workers
  • జిల్లాప్రభుత్వఆస్పత్రి కార్మికులకు తప్పని వేతన తిప్పలు
    పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఎమ్మెల్యేకు వినతి …………. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏ ఐ టి యు సి రాష్ట్ర కార్యదర్శి సాక్షిత వనపర్తి జూన్ 6
    వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికులకు పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)రాష్ట్ర కార్యదర్శి పి సురేష్ విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రి కార్మికులకు మూడు నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని, కార్మికులను వేధింపులకు గురి చేస్తున్న అంబియన్స్ ఏజెన్సీ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐటియుసి ప్రతినిధి బృందం గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు టి.మెగా రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
    ఈ సందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ:- ఏజెన్సీ పై విచారణ పేరుతో ఆస్పత్రి కార్మికుల వేతనాలు అందించడంలో తీవ్రమైన అలసత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు. సంబంధిత అంబియన్స్ ఏజెన్సీ నిర్వాహకులను అనేక పర్యాయాలు అడుగుతున్న దాటా వేసే సమాధానం చెబుతున్నారని అన్నారు. మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోతే కార్మికుల జీవనం సాగేది ఎలా అని అన్నారు.కార్మికులు స్థితి అడక్ కత్తెరలో పోకల మారిందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెల వరకు వేతన బడ్జెట్ విడుదల చేసిన కార్మికులకు వేతనాల తిప్పలు తప్పడం లేదని అన్నారు.విచారణకు వేతనాలకు సంబంధం లేకుండా తక్షణమే వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
    ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు శ్రీరాములు, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ సిపిఐ పట్టణ కార్యదర్శి జి.రమేష్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు కురుమయ్య కొండన్న తదితరులు పాల్గొన్నారు.

TEJA NEWS