TEJA NEWS

విశాఖలో నేడు ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక జాతికి అంకితం

విశాఖపట్నం : ఏపీలో నౌకాదళం హైడ్రోగ్రాఫిక్ సర్వేలకోసం ఉద్దేశించిన INS నిర్దేశక్ నౌకను జాతికి అంకితం చేయనున్నారు. విశాఖ నావెల్ డాక్ యార్డ్లో జరగనున్న ఈ కార్యక్రమానికి రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేత్ పాల్గొని నిర్దేశక్ నౌకను జాతికి అంకితమిస్తారు కోల్కతాలోని జీఆర్ఎస్ఈలో దేశీయంగా 80శాతం పరికరాలతో ఐఎన్ఎస్
నిర్దేశక్ నౌక నిర్మాణం జరిగింది. 110 మీటర్ల పొడవు, 3800టన్నుల బరువైన ఈ నౌకను రెండు ఇంజిన్లతో రూపకల్పన చేశారు.


TEJA NEWS