TEJA NEWS

Instead of TS RTC, TGS RTC is an RTC company

టీఎస్ ఆర్టీసీని త్వరలో టీజీఎస్ఆర్టీసీగా మార్చ నున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. త్వరలో లోగోలో మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఇక నుంచి బస్సులను టీజీ సిరీస్‌తో రిజిస్ట్రేషన్ చేయిం చనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నాటి ప్రభుత్వం టీఎస్ఆర్టీసీగా పేరు మార్చింది.

అయితే ఉద్యమం సమ యంలో టీజీని తెలంగాణ వాదులు, ప్రజలు ఉపయో గించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వచ్చాక టీఎస్‌ను టీజీగా మార్చుతామని ప్రకటిం చింది.

రాష్ట్రంలో టీజీ అమలుకు కేంద్రం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వగా, అన్ని ప్రభుత్వ సంస్థల పేర్లలో ‘టీఎస్’కు బదులు ‘టీజీ’ని ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది…


TEJA NEWS