TEJA NEWS

ఏపీ లో 12 యేళ్ల తర్వాత మారనున్న ఇంటర్‌ సిలబస్‌.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్మీడియెట్‌ సిలబస్‌ మారనుంది.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్‌ అమలు చేసేందుకు ఇంటర్‌ బోర్డు కసరత్తు చేస్తోంది.

వర్తమాన ప్రమాణాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు.

జాతీయ స్థాయి సిలబస్‌ అమలుకు అనుగుణంగా మార్పులు చేపట్టే దిశగా అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు.

పాఠశాల విద్యా బోధనలో మార్పులపై అధ్యయనం కోసం విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.

అదే విధంగా వివిధ రాష్ట్రాల్లో ఇంటర్‌ సిలబస్‌ అమలు తీరుపై ప్రత్యేక కమిటీలు అధ్యయనం చేస్తున్నాయి.

వాస్తవానికి ఇంటర్‌ సిలబస్‌పై అధ్యయనం చేసి మార్పులు తేవాలని గత ప్రభుత్వం హయాంలోనే నిర్ణయించినప్పటికీ.. ఈ విద్యా సంవత్సరంలో అధ్యయనం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

దాదాపు 12 యేళ్లుగా పాత సిలబస్సే కొనసాగుతోంది. దీనిని 2011-12 విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఎన్‌ఈపీ, వర్తమాన అంశాలను దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను సవరించి, దానిని 2025 -26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఆ తరువాత 2026 -27 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ రెండో ఏడాది సిలబస్‌ను మార్చనున్నారు.

ఇంటర్‌ విద్యా మండలి కమిషనర్, కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన కృతికా శుక్లా ఇంటర్‌ విద్యలో పలు మార్పులు తీసుకొచ్చారు


TEJA NEWS