ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం
ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు అవకాశం
విద్యాహక్కు చట్టం కింద 2024-25 విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో పేద పిల్లలకు ఉచిత అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న అనాథలు, హెచ్ఐవీ బాధితులు, విభిన్న ప్రతిభావంతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు.
రాష్ట్రంలోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో వీరికి 25 శాతం సీట్లు కేటాయించామని అన్నారు.
ఒకటో తరగతి నుంచి ప్రవేశానికి ఈ నెల 23 నుంచి మార్చి 14వ తేదీ వరకు అర్హత గల విద్యార్థుల ఆధార్ వివరాలతో http:-cse.ap.gov.in సైట్ లో అప్లై చేసుకోవాలని తెలిపారు. వివరాలకు సమీప మండల విద్యాశాఖాధికారి లేదా జిల్లా విద్యాశా ఖాధికారిని గానీ, 18004258599 టోల్ ఫ్రీ నం బరులో గానీ సంప్రదించాలని సూచించారు.