TEJA NEWS

హనుమకొండ జిల్లా..

దివి:- 09-04-2024..

వర్ధన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు దంపతుల ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్లి ఉగాది పర్వదినం సందర్భంగా వారు ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు .. అనంతరం వేద పండితులు రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు పొందాలని ఆశీర్వచనం చేయడం జరిగింది. తదనంతరం నిమ్మాని శేఖర్ రావు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు – మల్లీశ్వరి గార్ల దంపతులకు ముందస్తుగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ మారనేని వెంకటేశ్వరరావు 55వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం శివరాం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..


TEJA NEWS